వినోదం రాయడంలో హరీష్ శంకర్ దిట్ట. హరీష్ మొదటి సినిమా 'షాక్' సీరియస్ గా వుంటుంది కానీ తర్వాత చేసిన మిరపకాయ్, గబ్బర్ సింగ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, దువ్వాడ జగన్నాధం .. వినోదాత్మక చిత్రాలే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తోహరీష్ చేస్తున్న చిత్రం 'భవదీయుడు భగత్ సింగ్'. టైటిల్ కొంచెం సీరియస్ గా వుంది కానీ కంటెంట్ మాత్రం పక్కా ఎంటర్ట్రైనరని తెలుస్తుంది. ఈ సినిమా కోసం 'మిరపకాయ్' ఫార్ములాని మరోసారి వాడుతున్నారట హరీష్. మిరపకాయ్ లో రవితేజ హిందీ లెక్చరర్ గా పంచిన వినోదం ప్రేక్షకులని నవ్వించింది. అల్ పాచినో గా అలీ పంచిన హాస్యం కూడా ఆకట్టుకుంది. ఇప్పుడు అదే మార్క్ తో 'భవదీయుడు పాత్రలని డిజైన్ చేసినట్లు తెలుస్తుంది.
భవదీయుడు లో పవన్ కళ్యాణ్ తెలుగు లెక్చరర్ గా కనిపిస్తున్నారు. హీరోయిన్ పూజా హెగ్డే ఇంగ్లీష్ లెక్చరర్ గా కనిపించనుంది. ఈ రెండు పాత్రల చుట్టే బోలెడు వినోదం డిజైన్ చేశాడట హరీష్. మిరపకాయ్ లో అండర్ కవర్ పోలీసు కంటే హిందీ లెక్చరర్ పాత్రే భలే పేలింది. ఇప్పుడు భవదీయుడులో కూడా పవన్ కళ్యాణ్ తెలుగు లెక్చరర్ పాత్రని అంతకంటే హిలేరియస్ పేలుతుందనే నమ్మకంతో వున్నారు హరీష్. అన్నట్టు ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి కీలక పాత్రలో కనిపించనున్నారు. మిర్జాపూర్ వెబ్ సిరిస్ తో పంకజ్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయం. ఇప్పుడు ఆయన కూడా భవదీయుడులో బాగం కావడం ఒక అదనపు ఆకర్షణే. చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.