గబ్బర్ సింగ్ తరవాత.. పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబో మరోసారి సెట్టయ్యిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ద్విపాత్రాభినయం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆ పాత్రలు కూడా ఇప్పుడు రివీల్ అయిపోయాయి. ఓ పాత్ర కాలేజీ లెక్చరర్ అనీ, మరో పాత్ర.. పోలీస్ అని తెలుస్తోంది.
తొలి సగంలో లెక్చరర్ పాత్ర ఉంటుందట. రెండో సగంలో పోలీస్ పాత్ర ఎంటర్ అవుతుందట. ఓ రకంగా ఇది మిరపకాయ్ 2 అనిపిస్తోంది. అందులోనూ అంతే. రవితేజ ఓ పోలీసు.కానీ లెక్చరర్గా నటించాల్సి వస్తుంది. అండర్ కవర్ ఆపరేషన్‌లో భాగంగా ఓ కాలేజీకి లెక్చరర్గా వస్తాడు. కాకపోతే.. అది ఒకటే పాత్ర. ఇందులో మాత్రం పవన్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. అదీ తేడా. పవన్ పోలీస్ గా ఎలా విజృంభిస్తాడో గబ్బర్ సింగ్ లో చూపించేశాడు హరీష్. ఈసారి లెక్చరర్ గా ఎంత వినోదం పండిస్తాడో మరి.