ఇండ్రస్ట్రీకి ఎప్పుడూ టచ్‌లో ఉండాలి. కాస్త గ్యాప్ వచ్చిందంటే మర్చిపోతారు. స్టార్లకూ ఈ భయం వెంటాడుతుంటుంది. అందుకే... ఏదో ఓ రూపంలో అభిమానులకు టచ్‌లో ఉంటారు. కొంతకాలంగా వెండి తెరకు దూరమైంది ప్రియమణి. ఇప్పుడిప్పుడే మళ్లీ టచ్ లోకి వస్తోంది. విరాటపర్వం, నారప్పలలో కీలక పాత్రలు పోషిస్తోంది.
``కథానాయికగా మరో నాలుగేళ్లు రాణించే సత్తా నాలో ఉంది. కాకపోతే.. వయసుకు తగిన పాత్రల్ని ఎంచుకోవాలి. ఈ దశలో ప్రయోగాలకూ వెనకడగు వేసేది లేదు`` అంటోందట ప్రియమణి. తొలి రోజుల్లోనే ఉత్తమ నటిగా పలు పురస్కారాల్ని దక్కించుకున్న ప్రియమణికి.. ఆ తరవాత.. నటిగా తన స్థాయికి తగిన పాత్రలు రాలేదనే చెప్పాలి. ఈసారి మాత్రం నటనకు వెయిటేజీ ఉన్న పాత్రలే చేయాలని రూల్ పెట్టుకుందట. మరి సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతోందో?