ప్రేమ్ ర‌క్షిత్ అన్యాయ‌మైపోయాడా?

మరిన్ని వార్తలు

మ‌న దేశానికి ఆస్కార్ వ‌చ్చేసింది. ఎన్నో ఏళ్ల క‌ల ఫ‌లించింది. తెలుగు హృద‌యాల‌న్నీ ఇప్పుడు ఉప్పొంగుతున్నాయ్‌. ఆస్కార్ వేదిక‌పై కీర‌వాణి, చంద్ర‌బోస్‌... అవార్డులు అందుకుంటున్న దృశ్యం చాలా కాలం వ‌ర‌కూ క‌ళ్ల‌ల్లోంచి పోదు. అన్నీ ఓకే. కాక‌పోతే... ఈ పాట కోసం అహ‌ర్నిశ‌లూ క‌ష్ట‌ప‌డి.. ఈ పాట‌కి ఇంత‌టి జ‌నాద‌ర‌ణ క‌లిగించిన ఓ క‌ళాకారుడి ప్ర‌తిభ‌కు మాత్రం త‌గినంత గుర్తింపు లేదేమో అనిపిస్తోంది. త‌నే ప్రేమ్ ర‌క్షిత్‌.

ఈ పాట‌కు అద్భుత‌మైన డాన్స్ కంపోజ్ చేసి, ప్ర‌పంచ‌మంతా.. త‌న స్టెప్పుల్ని అనుక‌రించేలా చేసిన డాన్స్ మాస్ట‌ర్ ఈయ‌న‌. ముఖ్యంగా ఈ పాట‌లో ప్రేమ్ ర‌క్షిత్ వేయించిన సిగ్నేచ‌ర్‌, హుక్ స్టెప్పులు.. నెవ‌ర్ బిఫోర్ అన్న‌ట్టు సాగాయి. ప్ర‌పంచంలోని ప్ర‌తీ ఒక్క‌రూ ఈ స్టెప్పుల్ని కాపీ కొట్టిన వాళ్లే. ఎక్క‌డ చూసినా ఇవే స్టెప్పులు. అందుకోసం... ప్రేమ్ ర‌క్షిత్ ప‌డిన క‌ష్టం అంతా ఇంతా కాదు.

 

సినిమా కోసం ఆయ‌న 95 స్టెప్పుల్ని కంపోజ్ చేశారు. హుక్ స్టెప్ కోసం ఏకంగా 30 స్టెప్పులు డిజైన్ చేశారు. దాని వెనుక నెల‌ల త‌ర‌బ‌డిన శ్రమ ఉంది. ఈ పాట రాసిన చంద్ర‌బోస్‌, ట్యూన్‌క ట్టిన కీర‌వాణి అవార్డులు అందుకొన్నారు. పాట పాడిన కాల‌భైర‌వ‌, సిప్లిగంజ్‌లకు ఆస్కార్ వేదిక ఎక్కి, త‌మ ప్ర‌తిభ‌ని చూపించే అవ‌కాశం ద‌క్కింది. కానీ.. ప్రేమ్ ర‌క్షిత్ పై మాత్రం మీడియా ఫోక‌స్ చేయ‌లేదు. చేయ‌లేక‌పోయింది కూడా.

 

పాట విడుద‌లైన‌ప్పుడు రాసి స్పంద‌న‌.. తెర‌పై ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌ల డాన్స్ చూసిన‌ప్పుడు వ‌చ్చిందంటే... దానికి కార‌ణం.. క‌చ్చితంగా కొరియోగ్ర‌ఫీనే. ప్ర‌పంచ‌మంతా.. ట్యూన్‌తో పాటు, ఆ స్టెప్పుల‌కు, ఆ వేగానికీ ఫిదా అయిపోయింది. కానీ.. అవార్డులో ఆయ‌న‌కు వాటా లేకుండా పోయింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS