ఉద్దానం కిడ్నీ సమస్య పై పవన్ కళ్యాణ్ నేడు విశాకపట్నంలో పర్యటిస్తున్నాడు.
ఈ మధ్య ఆయన హార్వర్డ్ విశ్వవిద్యాలయం సందర్శించినప్పుడు ఉద్దానం కిడ్నీ సమస్య పై అక్కడి డాక్టర్ల తో చర్చించారు. ఇక ఇక్కడ సమస్య తెలుసుకునేందుకు డాక్టర్ల బృందం ఉద్దానం లో పర్యటించింది.
ఇక ఆ సమావేశంలో పవన్ మాట్లాడుతూ- ఇటువంటి సమస్య పై పోరాడటానికి అందరు కలిసి రావాలి. ఈ సమస్యని అధిగమించడానికి పాలక-ప్రతిపక్షాలు కలిసి రావాలి అంటూ ఆయన పిలుపునిచ్చాడు.
రేపు ఇదే అంశం పై ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడి ని రేపు కలవనున్నారు. హార్వార్డ్ డాక్టర్లు అందించిన రిపోర్టుని ఆయన స్వయంగా ముఖ్యమంత్రికి అందివ్వనున్నారు.