గత అసెంబ్లీ ఎన్నికలలో భీమవరం, గాజువాక స్థానాల నుంచి పోటీ చేసి ఓడిపోయాడు పవన్ కల్యాణ్. రెండు చోట్ల నిలబడినా, ఒక్కచోట కూడా గెలవకపోవడం అభిమానుల్నితీవ్రంగా నిరాశకు గురి చేసిన విషయం. ఈసారి తాను నిలబడే స్థానం ఏమిటన్న విషయంలో పవన్ కల్యాణ్‌కి ముందే ఓ స్పష్టత వచ్చేసినట్టు టాక్. ఈసారి ఆయన దృష్టి కాకినాడ పై పడిందని సమాచారం.
కాకినాడ లో రెండు అసెంబ్లీ నియోజనవర్గాలు ఉన్నాయి. ఒకటి కాకినాడ అర్బన్, మరోటి కాకినాడ రూలర్. ఈ రెండింటిలో ఒక చోట నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది. గతంలో రెండుచోట్ల నిలబడినా, ఈసారి మాత్రం ఒకే స్థానాన్ని ఎంచుకుని, అక్కడ గట్టిగా ఫోకస్ చేయాలని పవన్ భావిస్తున్నాడట. కాకినాడలో కాపుల ఓటింగ్ ఎక్కువ. అందుకే పవన్ దృష్టి కాకినాడపై పడిందని టాక్. కాకినాడలో పవన్ నిలబడితే గెలుస్తాడా, లేదా? ఆ అవకాశాలు ఎంత ? అనే విషయాన్ని లోపాయికారీ గా సర్వే చేయించాడని, అన్ని రకాలుగా తనకు అనుకూలంగా ఉంది కాబట్టే ఆ స్థానాన్ని ఎంచుకున్నాడని టాక్.