తొలిరోజున కాటమరాయుడు రికార్డు వసూళ్లతో అదరగొట్టేశాడు. తొలిరోజునే దాదాపుగా రూ.23 కోట్లు సాధించి టాలీవుడ్ లో నెం.2 స్థానాన్ని కైవసం చేసుకొన్నాడు. అయితే రెండో రోజు వసూళ్లు దారుణంగా పడిపోయాయి. అంతా పోగేస్తే రూ.5.5 కోట్లు కూడా రాలేదు. అన్ని చోట్లా... కలక్షన్లు డ్రాప్ అయ్యాయి. నైజంలో మాత్రం రూ.1.38 కోట్లతో కాస్త ఫర్వాలేదనిపించాడు రాయుడు. సాధారణంగానే ఓ పెద్ద సినిమాకి రెండో రోజు వసూళ్లు తగ్గుతాయి. తొలిరోజు ఉన్న వేడీ, క్రేజ్ రెండో రోజు కనిపించవు. కానీ... మరీ ఇంత భారీ మార్పు మాత్రం అరుదైన విషయమే. కాటమరాయుడు సినిమాకి డివైడ్ టాక్ రావడం, చుట్టేశారన్న విమర్శలు ఎదుర్కోవడంతో వసూళ్లు డ్రాప్ అయ్యాయంటున్నారు విశ్లేషకులు. ఓవర్సీస్లో అయితే... కాటమరాయుడి పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. మొత్తానికి తొలి రెండు రోజుల్లో రూ.28.5 కోట్లు సాధించగలిగింది ఈ చిత్రం. ఆదివారం వసూళ్లు కూడా అంతంత మాత్రంగానే ఉండే అవకాశాలున్నాయి.