పవన్ కల్యాణ్ - క్రిష్ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. కొంతమేర షూటింగ్ జరిగి, లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. వకీల్ సాబ్ తరవాత.. పవన్ మొదలెట్టే సినిమా ఇదే. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ లుక్ ఇటీవల పవన్ పుట్టిన రోజు సందర్భంగా వదిలారు. అయితే టైటిల్ ఏమిటన్నది ఇప్పటి వరకూ తెలీలేదు. `విరూపాక్ష` అనే టైటిల్ ముందు నుంచీ ప్రచారం లోనే ఉంది. కానీ.. దీనిపై ఇప్పటి వరకూ చిత్రబృందం స్పందించలేదు. అవుననో, కాదనో చెప్పలేదు.
వీరూపాక్ష సౌండింగ్ బాగున్నా, అర్థం చేసుకోవడానికి కాస్త కష్టతరంగానే ఉంది. పైగా క్యాచీ టైటిల్ కూడా కాదు. అందుకే... ఈసినిమా కోసం మరో టైటిల్ అన్వేషిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పుడు `ఓం శివమ్` అనే పేరు బయటకు వచ్చింది. ప్రీ లుక్ లో పవన్ చేతికి ఓం అనే లాకెట్ ఉంది. పవన్ శివ భక్తుడుగా నటిస్తున్నాడని క్రిష్ హింట్ ఇచ్చేశాడు. ఆ రకంగా చూస్తే మాత్రం `ఓం శివమ్` అనే టైటిల్ ఫిక్సయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి క్రిష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో, చివరికి ఏ టైటిల్ ఖరారు చేస్తాడో చూడాలి.