తీగ లాగితే డొంక కదిలినట్టు సుశాంత్ సింగ్ ఆత్మహత్యకేసు కదిపితే - డ్రగ్స్‌రాకెట్ ముఠా గుట్టు రట్టయ్యింది. డ్రగ్స్‌ముఠాతో 24 మంది బాలీవుడ్ సెలబ్రెటీలకు లింకులున్నాయని, వారిలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉందని వార్తలొచ్చాయి. ఇంకేముంది? రకుల్ ని త్వరలోనే అధికారులు విచారిస్తారని, అమె అనవసరంగా డ్రగ్స్‌కేసులో బుక్కయిందని అనుకున్నారంతా. కానీ... అలాంటిదేం లేదట.
అసలు డ్రగ్స్ కేసుకి సంబంధించి 24 మంది సెలబ్రెటీల లిస్టు అంటూ ఏదీ లేదని అధికారులు స్పష్టం చేశారు. అందులో రకుల్ పేరు లేనేలేదని, ఇదంతా మీడియా సృష్టి అని తేల్చేశారు. దాంతో.. రకుల్ కి భారీ రిలీఫ్ కలిగినట్టైంది. రకుల్ పేరు బయటకు రాగానే అమెపై చాలా సెటైర్లు పడ్డాయి. మీమ్స్ బయల్దేరాయి. రకుల్ తో పాటు, చాలామంది టాలీవుడ్ సెలబ్రెటీలు కూడా బయటకు వస్తారని అనుకున్నారు. అయితే... ఇదంతా అంబక్ అని తేలిపోయింది. దాంతో.. రకుల్ పై సెటైర్లు వేసినవాళ్లంతా సైలెంట్ అయిపోయారు.