ప‌వ‌న్ కోసం కొత్త టైటిల్

By iQlikMovies - July 07, 2020 - 13:21 PM IST

మరిన్ని వార్తలు

ప‌వ‌న్ క‌ల్యాణ్ - క్రిష్ క‌ల‌యిక‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. చారిత్ర‌క నేప‌థ్యం ఉన్న స‌బ్జెక్ట్ ఇది. రూ.100కోట్ల‌కు పైగానే బ‌డ్జెట్ అవ్వ‌నుంది. ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో భారీ సెట్స్‌ని తీర్చిదిద్దుతున్నారు. సింహ భాగం అక్క‌డే షూటింగ్ జ‌ర‌గ‌బోతోంది. ఈ సినిమా కోసం ఇది వ‌ర‌కు `విరూపాక్ష‌` అనే టైటిల్ ప్ర‌చారంలో వినిపించింది. టైటిల్ మ‌రీ క్లాసీగా ఉంద‌ని, చాలామందికి అర్థం కాద‌నే అనుమానాలు, భ‌యాలూ రావ‌డంతో చిత్ర‌బృందం పున‌రాలోచ‌న‌లో ప‌డిందని టాక్‌.

 

ఈసినిమాలో ప‌వ‌న్ ఓ గ‌జ దొంగ‌గా క‌నిపించ‌నున్నాడు. ఆ క్యారెక్ట‌ర్‌కి త‌గ్గ‌ట్టుగానే పేరు పెట్టాల‌ని క్రిష్ భావిస్తున్నాడ‌ట‌. అయ‌తే.. ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాకి కొత్త కొత్త టైటిళ్లు సృష్టిస్తున్నారు. `గ‌జ‌దొంగ‌`, `బందిపోటు` లాంటి పేర్లు ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. చిత్ర‌బృందం ఈ పేర్ల‌ని ప‌రిశీలిస్తోందా? లేదంటే అభిమానులే అత్యుత్యాహంతో ఈ పేర్లు ప్ర‌చారంలోకి తీసుకొస్తున్నారా? అనేది తెలియాల్సివుంది. కొంత‌మంది అయితే.. ఏకంగా ఫ్యాన్ మేడ్ పోస్ట‌ర్లే త‌యారు చేసి వ‌దులుతున్నారు. ఈ గాసిప్పుల‌న్నీ ఆగాలంటే... చిత్ర‌బృందం స్పందించాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS