నిన్న ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా జరిగిన సినీ సంగీత విభావరి కార్యక్రమంలో చాలా మంది సినీ పరిశ్రమకి చెందిన ప్రముఖులు హజరయ్యారు.
ఈ సందర్భంగా కొంతమంది ప్రముఖ హీరోలు ఈ కార్యక్రమానికి గైరుహాజరు అవ్వడం ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. ముఖ్యంగా తెలుగు వారు ఎక్కడున్నా వారి కోసం తాను ఉంటాను అని అలాగే తెలుగు సాహిత్యాన్ని తన ప్రసంగాలలో ఉటంకిస్తూ ప్రసంగించే పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి రాకపోవడం ఏంటి అని అందరు ఆరా తీస్తున్నారు.
అలాగే జనసామాన్యంలో బాగా పాపులారిటీ పొందిన ఇతర ప్రముఖ హీరోలు- రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి వారు ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టడం మంచి పద్ధతి కాదు అన్న వాదనలు వినవస్తున్నాయి.
అయితే వారి ముందు తరం అనగా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ తదితరులు ఈ కార్యక్రమానికి వచ్చి సినీ పరిశ్రమ గౌరవాన్ని మరింత పెంచారు.