చిట్టిబాబు నా తమ్ముడు: పవన్ కళ్యాణ్

మరిన్ని వార్తలు

మెగా పవర్ స్టార్ చిత్ర విజయోత్సవ సభలో పవర్ స్టార్ హంగామా చేశాడు. కంటికి ఇన్ఫెక్షన్ వచ్చిన కారణంగా ఆయన కూలింగ్ గ్లాస్ పెట్టుకొని చాలా స్టైలిష్ గా కనిపించారు పవన్ కళ్యాణ్.

ఇక రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ నటన గురించి ఆయన మాట్లాడుతూ- భూమికి చాలా దగ్గరగా ఉండే మనిషి, గెలుపుని-ఓటమిని ఒకేలా చూసే మనిషి, రిజల్ట్ తో సంబంధం లేకుండా తన పనిని తాను చేసుకుపోయే రకం అని తన అన్న కొడుకుని పొగడ్తలతో ముంచేశాడు.

 

ఇదే సమయంలో రామ్ చరణ్ ని తాను ఎప్పుడు ఒక కొడుకుగా కాకుండా తన తమ్ముడిగానే చూస్తాను అని చిరంజీవి గారు అన్న కాదు అని తన తండ్రి అని అలాగే సురేఖ గారు తనకి అమ్మ అని చెప్పడంతో సభలో హర్షాతిరేకలు వెల్లువెత్తాయి. ఇక రామ్ చరణ్ వెంటనే పవన్ కాళ్ళకి మొక్కడం ఒకరిని మరొకరు ఆత్మీయంగా ముద్దుపెట్టుకోవడం కూడా ఈ మొత్తం సభలో హైలైట్ అని చెప్పుకోవచ్చు.

మొత్తానికి పవన్ కళ్యాణ్ రాకనే కాకుండా ఆయన స్పీచ్ కూడా ఈ సభకి నిండుతనం చేకూరింది అని చెప్పొచ్చు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS