నందమూరి బాలకృష్ణ వీరసింహా సెట్స్ లో సందడి చేశారు పవన్ కళ్యాణ్. దర్శకుడు క్రిష్,ఎఎం రత్నం తో కలసి వీర సింహ రెడ్డి సెట్స్ కి వెళ్లారు. బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షోకి పవన్ కళ్యాణ్ గెస్ట్ గా రాబోతున్నారు. అంతకంటే ముందే వీరసింహ సెట్ లో అంతా కలిశారు. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు తెరకెక్కుతోంది. మరోవైపు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహ సంక్రాంతి బరిలో నిలుస్తుంది.
వీరసింహ షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇప్పటికే విడుదలైన జై బాలయ్య, సుగుణ సుందరి పాటలు హిట్ అయ్యాయి. మనోభావాల్ అనే మరో పాట విడుదల కాబోతుంది. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ థమన్ మ్యూజిక్. జనవరి 12, 2023న సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.