నటీనటులు: నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్, అజయ్, సరయు.
దర్శకుడు : సూర్యప్రతాప్ పల్నాటి
నిర్మాత: బన్నీ వాస్
సంగీత దర్శకులు: గోపి సుందర్
సినిమాటోగ్రఫీ: వసంత్
ఎడిటర్: నవీన్ నూలి
రేటింగ్ : 2.75/5
సుకుమార్ నుండి ఒక కథ వస్తుందంటేనే ఒక ఆసక్తి.. కార్తికేయ 2తో పాన్ ఇండియా విజయాన్ని అందుకున్న ఆ కథలో హీరో అవ్వడం మరింత క్యురియాసిటీ పెంచింది... పైగా అల్లు అరవింద్ లాంటి స్టార్ నిర్మాత సమర్పించారు... సుకుమార్ కథతో తెరకెక్కించాడు దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్. గతంలో' కుమారి 21 F' తో విజయాన్ని అందుకున్న కాంబినేషన్ ఇది... ఇవన్నీ '18 పేజెస్' పై అంచనాలు పెంచాయి. మరా అంచనాలని ఈ చిత్రం అందుకుందా ? ఇంతకీ సుకుమార్ రాసిన పేజీల్లో ఏముంది ?
కథ:
సిద్ధు( నిఖిల్) ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ప్రీతీ అనే అమ్మాయిని ప్రేమించి మోసపోతాడు. అనుకోకుండా సిద్దుకు రోడ్డు పక్కన ఒక రోజు డైరీ దొరుకుతుంది. నందిని(అనుపమ పరమేశ్వరన్)రాసిన డైరీ అది. ఆ డైరీ చదివి, నందినిని చూడకుండానే ప్రేమించేశాడు సిద్దు. అసలు ఆ డైరీ ఏముంది? ఆ డైరీ చదివాక సిద్ధులో వచ్చిన మార్పులేంటి? సిద్ధు నందినిని కలిశాడా? సిద్ధు ప్రేమ ఫలిచిందా ? అన్నది మిగతా కథ.
విశ్లేషణ:
ఒకరి ఒకరు చూడకుండా చూడకుండా ప్రేమించుకునే చిత్రాలు గతంలో చాలా వచ్చాయి. 18 పేజెస్ లైన్ కూడా అదే. అయితే ఈ కథని నడిపిన విధానం మాత్రం కొత్తగా వుంటుంది. అసలు హీరో, హీరోయిన్ చివరి సీన్ లో గాని కలుసుకోరు. పైగా హీరో తనని ప్రేమిస్తున్నాడని , చివరి దాక హీరోయిన్ కి తెలీదు. ఇలాంటి నేపధ్యంలో ఒక ఫీల్ గుడ్ లవ్ స్టొరీగా ఈ కథని నడిపిన సుకుమార్ తెలివితేటల్ని మెచ్చుకోవాల్సిందే. ఒకపైపు ప్రేమకథని చూపిస్తూనే.. మరోవైపు తర్వాత ఏం జరుగుతుందనే టెన్షన్‌ని ప్రేక్షకులకు కలిగించారు. ఊహించని మలుపుతో ఆద్యంతం ఆసక్తికరంగా కథనం సాగుతుంది.
సిద్ధుని పరిచయం చేస్తూ సినిమాని ప్రారంభించిన సాదరనంగానే వున్నా.. నందిని డైరీ చదవడం ప్రారంభించాకే.. అసలు కథ ఆసక్తికరంగా మొదలవుతుంది. నందిని పాత్రని తీర్చిదిద్దిన తీరు కొత్త అనుభూతిని పంచుతుంది. అలాంటి లైఫ్ స్టయిల్ సాధ్యం కాదు కానీ అలా వుంటే బావుండని పిస్తుంది. కొన్ని చోట్ల మెసేజ్ ఇచ్చినట్లు అనిపించీనా దానిని కథనంలో భాగం చేయడం ఆకట్టుకుంది. నందిని కథ గతంలోనూ.. సిద్ధు కథ వర్తమానంలోనూ సాగుతున్నా.. ప్రేక్షకులు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఆ కథలతో ప్రయాణం చేసేస్తుంటారు.
ఇంటర్వెల్ కి ముందు వచ్చే ట్విస్ట్ ద్వితీయార్ధంపై ఆసక్తి రేకెత్తించేలా చేస్తుంది. విరామం తర్వాత సినిమా థ్రిల్లర్ జానర్‌లోకి మారుతుంద. నందిని యాక్సిడెంట్‌కు.. తను తీసుకొచ్చిన కవర్‌కు లింక్ ఉందని తెలిశాక అందులో ఏముందో తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రేక్షకుల్లోనూ పెరుగుతుంది. ముగింపు కూడా ఫీల్ గుడ్ గా రాసుకోవడం మెప్పిస్తుంది. అయితే కవర్ చుట్టూ నడిపిన డ్రామా కాస్త గంధరగోళాలనికి గురి చేస్తుంది. వాటిని మరి కాస్త వివరంగా చూపినట్లయితే బావుండేదనిపిస్తుంది. ఏదేమైనా ఫీలి గుడ్ ట్రీట్ మెంట్ తో ఈ కథని నడిపిన విధానం ప్రేక్షకులని మెప్పిస్తుంది.
నటీనటులు :
నిఖిల్ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారు. లవర్ బాయ్ గా స్టయిలీష్ గా కనిపిస్తూనే ఎమోషనల్ సీన్స్ లో తన పరిణితి చూపించాడు. అనుపమ పరమేశ్వరన్ కి మంచి పాత్ర దక్కింది. కథ అంతా ఆమె పాత్ర చుట్టే తిరుగుతుంది.
ఈ పాత్రని కథకుడు చాలా ప్రేమతో రాసుకున్నాడు. అనుపమ నటన ఆకట్టుకుంటుంది. సరయ తెలంగాణ యాసలో అలరించింది. పోసాని కృష్ణమురళి, డాక్టర్ సందీప్‌గా దినేశ్ తేజ్, కండక్టర్ పాత్రలో రమణ, విలన్ పాత్రలో అజయ్ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్:
గోపీసుందర్ పాటలు, బీజీఎం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ సుకుమార్ కథకు న్యాయం చేశాడు. కొన్ని మాటలు గుర్తుపెట్టుకునేలా వున్నాయి.
వసంత్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ బాగున్నాయి. జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
కథ, కథనం
నిఖిల్, అనుపమ నటన
పాటలు, నేపధ్య సంగీతం
మైనస్ పాయింట్స్
అక్కడక్కడ సాగదీత
ద్వితీయార్ధంలో కొన్ని తికమక పెట్టె సీన్స్
ఫైనల్ వర్దిక్ట్ : చూడాల్సిన పేజీలు