పవన్ కళ్యాణ్ పేరు మారింది..?

మరిన్ని వార్తలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన కెరీర్ లో విజయాల కంటే అపజయాలే ఎక్కువ ఉన్నా పవర్ స్టార్ స్టామినా ఏ మాత్రం తగ్గలేదు. సినిమా సినిమాకు తన స్టామినా ను పెంచుకుంటూ దూసుకెళ్ళిపోతున్నాడు.

అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు మారిపోయింది. కొత్త పేరు ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా.? ఆ పేరు కుషాల్ బాబు. ప్రస్తుతం గూగుల్ లో పవన్ కళ్యాణ్ పేరు టైప్ చేస్తే కుషాల్ బాబు అని వస్తుంది. పవన్ కళ్యాణ్ అసలు పేరు కొణిదెల కళ్యాణ్ బాబు. కానీ ఇండస్ట్రీ కి వచ్చిన తర్వాత ఆయన పేరు పవన్ కళ్యాణ్ గా మారింది. అభిమానులలో ఆయనకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తో పవర్ స్టార్ అయ్యారు. కాని ఇప్పుడు కుషాల్ బాబు ఎందుకు అయ్యాడో మాత్రం ఫాన్స్ కి తెలియట్లేదు.

ప్రస్తుతం పవన్, త్రివిక్రమ్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన పేరు కుషాల్ బాబు అనుకోవాలా? ఒకవేళ అలా అయినా ఎవరికీ తెలియకుండా గూగుల్ కి మాత్రమే ఎందుకు తెలుస్తుంది. వీటన్నిటికీ సమాధానం పవన్ త్వరలో చెబితే కానీ మనకి తెలియదు. అప్పటి వరకు పవన్ ఫాన్స్ వేచి చూడక తప్పదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS