ఈరోజుల్లో చిత్రాలు సక్సెస్ అవ్వకపోయినా సక్సెస్ మీట్ పెడుతుండడం ఒక ప్రమోషన్ లో భాగంగా మారిపోయింది. అయితే సూపర్ స్టార్ మహేష్ మాత్రం ఇందుకు భిన్నగా స్పందించి అందరిని ఆశ్చర్యపరిచాడు.
వివరాల్లోకి వెళితే- స్పైడర్ చిత్రం తన అభిమానులని నిరాశపరిచింది అన్న విషయాన్ని గ్రహించిన మహేష్ బాబు ముందగా ప్లాన్ చేసిన సక్సెస్ మీట్ ని రద్దు చేయమని చెప్పాడట. అలాగే కుటుంబాన్ని తీసుకొని ఒక చిన్న హాలిడేకి వెళ్ళిపోయినట్టు సమాచారం.
మొన్న జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ లోనే తన చిత్రం నచ్చకపోతే తన అభిమానులే చూడరు అని ఎంత నిజాయితీగా చెప్పాడో ఇప్పుడు తను కూడా అంతే నిజాయితీగా ప్రవర్తించడంతో అందరి చేత నిజమైన స్టార్ అని అనిపించుకుంటున్నాడు.