పవన్ కళ్యాణ్ గేర్ మార్చారు. సినిమాల జోరు పెంచారు. ప్రస్తుతం క్రిష్ `హరిహర వీరమల్లు` చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారు పవన్ కళ్యాణ్. మరోవైపు హరీష్ శంకర్ సినిమా పనులు కూడా జోరుగా జరుగుతున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నుండి మరో కొత్త సినిమా ప్రకటన వచ్చింది. సాహో` ఫేమ్ సుజిత్‌తో పవన్ ఓ సినిమా చేయబోతున్నరని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడదే కాంబినేషన్ పై అధికారిక ప్రకటన వచ్చింది. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రవి కె చంద్రన్ కెమరామెన్.
కాగా పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ సినిమా కూడా దాదాపు ఫైనల్ అయ్యింది, ఇటివలే పూర్తి స్క్రిప్ట్ విన్న పవన్ కళ్యాణ్ ఓకే చెప్పారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించనుంది. హరీష్ శంకర్ 'గబ్బర్ సింగ్ 'లాంటి మాస్ ఎంటర్ టైనర్ ని పవన్ కోసం రాసుకున్నారని తెలుస్తోంది.