పవన్ కళ్యాణ్ కి సాధ్యం కాని కోరిక కోరిన అభిమాని..!

మరిన్ని వార్తలు

'మీరు ఏ రంగాన్ని అయినా ఎంచుకోండి.. కానీ, సినిమాల్ని మాత్రం మానెయ్యకండి' అంటూ సినీ నటుడు నితిన్‌, తన అభిమాన హీరో పవన్‌కళ్యాణ్‌కి సవినయంగా విన్నవించుకున్నాడు. నితిన్‌ అంటే పవన్‌కళ్యాణ్‌కి ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ అభిమానంతో నితిన్‌ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించాడు. అదే 'ఛల్‌ మోహనరంగ'. 

త్వరలో విడుదల కానుంది ఈ సినిమా. ఇటీవల ఈ సినిమా ఫంక్షన్‌లో పవన్‌, నితిన్‌ మధ్య ఇంట్రెస్టింగ్‌ టాపిక్‌ నడిచింది. సినీ రంగంలో హీరోగా ఎదగడం ఎంత కష్టమో తనకు తెలుసనీ, నితిన్‌ పట్టుదల వున్న వ్యక్తి అనీ పవన్‌ చెబితే, పవన్‌కళ్యాణ్‌ తన అభిమాన నటుడనీ, వ్యక్తిగానూ ఆయనంటే తనకు చాలా ఇష్టమనీ, అలాంటి పవన్‌కళ్యాణ్‌, తన సినిమాని నిర్మించడాన్ని మాటల్లో వర్ణించలేకపోతున్నానని నితిన్‌ చెప్పాడు. ఈ సందర్భంగానే నితిన్‌, 'పవన్‌కళ్యాణ్‌గారూ, మీరు సినిమాల్ని మానేయొద్దు మాకోసం' అని చెప్పడంతో అభిమానులు ఒక్కసారిగా ఆడిటోరియంని హోరెత్తించేశారు. 

రాజకీయాల్లో బిజీ అయిపోయిన పవన్‌కళ్యాణ్‌, 'ఇక సినిమాలు చేయలేనేమో' అనే సంకేతాలు పంపడంతో అభిమానులు డీలాపడిపోయారు. అయితే నితిన్‌ అడిగాడు కాబట్టి, పవన్‌ ఓ సినిమా త్వరలోనే పట్టాలెక్కించే అవకాశం వుంది. ఏమో, ఆ సినిమాని నితిన్‌ స్వయంగా నిర్మించవచ్చునేమో. 'ఛల్‌ మోహనరంగ' సినిమాకి పవన్‌తోపాటు త్రివిక్రమ్‌ కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 'లై' ఫేం మేఘా ఆకాష్‌ ఈ సినిమాలో ఇంకోసారి నితిన్‌తో జతకడ్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS