ఈ వారం కూడా ప్రేక్షకుల ముందుకి రెండు చిత్రాలు వచ్చాయి. అందులో ఒకటి నీది నాది ఒకే కథ.. ఇంకొకటి MLA.
ముందుగా నీది నాది ఒకే కథ సినిమా గురించి మాట్లాడుకుంటే, ఈ చిత్రం ప్రస్తుతం సమాజంలో ఉన్న సమకాలీన అంశం పైన ఈ సినిమా తెరకెక్కించడం జరిగింది. దర్శకుడు వేణుకి ఇది తొలి చిత్రమే అయినా చాలా చక్కటి కథాంశం తీసుకోవడం అలాగే ఆ అంశాన్ని ప్రేక్షకులకి చేరవేయ్యడంలో కూడా దాదాపుగా విజయవంతం అయ్యాడు అనే చెప్పాలి.
ఇక ఈ సినిమాలో హీరోగా చేసిన శ్రీవిష్ణు ని ప్రత్యేకంగా అభినందించాలి, ఆయన నటన ఈ సినిమాకి ప్రాణం అని చెప్పొచ్చు. దర్శకుడు ప్రేక్షకులకి కథానాయకుడి పాత్ర ద్వారా ఏదైతే చెప్పాలనుకున్నాడో అది చెప్పడంలో నూటికినూరు శాతం సఫలమయ్యాడు.
ఈ వారం విడుదలైన రెండవ చిత్రం- MLA. టైటిల్ పరంగా పొలిటికల్ గా అనిపిస్తునా సినిమా చూస్తే మాత్రం ఇదొక ఫక్తు కమర్షియల్ చిత్రంగా తెలుస్తుంది. MLA- మంచి లక్షణాలున్న అబ్బాయి అని అంటూనే రచయత-దర్శకుడు అయిన ఉపేంద్ర మాధవ్ దీనిని ఒక మంచి మాస్ అంశాలున్న చిత్రంగా మలిచే ప్రయత్నం చేశాడు.
అయితే కొంతవరకు ఆ ప్రయత్నంలో ముందుకుసాగినా చివరికి మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయాడు అనే చెప్పొచ్చు. ఇదే సమయంలో కళ్యాణ్ రామ్ మాత్రం హీరోయిజం తో పాటుగా హాస్యాన్ని కూడా పండిస్తూ మరోసారి పటాస్ చిత్రం తరహాలో అభినయం పలికించాడు. మరి ఈ చిత్ర భవిష్యత్తు మాత్రం బాక్స్ ఆఫీస్ వసూళ్ళని బట్టే ఉంటుంది.
ఇది ఈ వరం www.iqlikmovies.com టాక్ అఫ్ ది వీక్.