ఇప్పటివరకు ట్వీట్లతోనే స్పెషల్ స్టేటస్ గురించి పోరాడుతున్న పవన్ ఇక తన పద్దతిని మార్చుకోబోతునట్టున్నాడు.
అందుతున్న తాజా సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్ రేపు ఉదయం 9గంటలకు ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడు. అయితే ఈ ప్రెస్ మీట్ లో తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించబోతున్నాడు. ఒక రకంగా ఈరోజు జరిగిన సంఘటనలతో స్పెషల్ స్టేటస్ ఉద్యమానికి ఒక ఊపు వచ్చినట్టయింది.
ఇదే తరుణంలో పవన్ తన పోరాట పంథా మార్చుకొని ఇంకొంత దూకుడు ప్రదర్శిస్తాడని అందరు ఆశిస్తున్నారు. ముఖ్యంగా పవన్ వైపు ఆంధ్ర రాష్ట్ర యువత ఆసక్తిగా చూస్తున్నారు.
చూద్దాం.. పవన్ ఏ మేరకు ఈ ఉద్యమాన్ని ముందుకి తీసుకెళ్ళగలడో!!