ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. సినిమా నెంబ‌ర్ 5

మరిన్ని వార్తలు

రీ ఎంట్రీలో ప‌వ‌న్ క‌ల్యాణ్ విజృంభ‌ణ మామూలుగా లేదు. ప‌వ‌న్ కి ఏమాత్రం క్రేజ్ త‌గ్గ‌లేద‌ని వకీల్ సాబ్ ఫ‌స్ట్ లుక్‌కి వ‌చ్చిన స్పందన చూస్తే అర్థ‌మైపోతోంది. ప‌వ‌న్ సినిమా కోసం ఇప్ప‌టికీ అభిమానులు అదే స్థాయిలో ఎదురు చూస్తున్నార‌న్న విష‌యం వ‌కీల్ సాబ్ గుర్తు చేసింది. దాంతో ప‌వ‌న్ కోసం ఎగ‌బ‌డే ద‌ర్శ‌కులు, నిర్మాత‌ల సంఖ్య మ‌రింత‌గా పెరిగింది.

 

ప‌వ‌న్ ఇప్ప‌టికే రెండు సినిమాల్ని ప‌ట్టాలెక్కించేశాడు. అందులో ఒక‌టి వ‌కీల్ సాబ్‌, రెండోది క్రిష్ సినిమా. హ‌రీష్ శంక‌ర్ సినిమా కూడా ఆల్మోస్ట్ ఖ‌రారైపోయిన‌ట్టే. త్వ‌ర‌లోనే ఓ అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తోంది. పూరి జ‌గ‌న్నాథ్‌తో ప‌వ‌న్ సినిమా చేయ‌బోతున్నాడ‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే ఈ విష‌యంలో ఇంకా క్లారిటీ లేదు. కానీ ఈ కాంబో ప‌ట్టాలెక్క‌డం ఖాయం అని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు చెబుతున్నాయి.

 

ఈలోగా మ‌రో వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప‌వ‌న్ - త్రివిక్ర‌మ్ మ‌ళ్లీ ఓ సినిమా చేయ‌బోతున్నార‌ని, 2021లో ఈ చిత్రం ప‌ట్టాలెక్కుతుంద‌ని స‌మాచారం. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ నిర్మించ‌నున్న‌ద‌ని టాక్‌. అంటే ప‌వ‌న్ చేతికి అందిన 5 వ సినిమా ఇద‌న్న‌మాట‌. విచిత్ర‌మేమిటంటే ఈ 5 సినిమాలూ 2022లోగా పూర్త‌వ్వాలి. విడుద‌లైపోవాలి. అంటే టైమ్ ఏమాత్రం లేదు. ప‌వ‌న్ ఇప్పుడు బ‌య‌ట కంటే సినిమా సెట్లోనే ఎక్కువ క‌నిపిస్తాడ‌న్న‌మాట‌. ప‌వ‌న్ ఫ్యాన్స్‌కి కూడా అదే కావాలి క‌దా..?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS