గత వారం భారీ అంచనాలతో విడుదలైన 'జాను' చిత్రం.. మంచి రివ్యూలు వచ్చినా కూడా బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. ఇది తమిళ క్లాసిక్ హిట్ చిత్రం 96' కి రీమేక్. అప్పటికే '96' చిత్రాన్ని దాదాపు తెలుగు ప్రేక్షకులు చూసేసారు.. అయినా కూడా ఈ చిత్రాన్ని దిల్ రాజు తెలుగు లో విడుదల చేసి నిరాశ పరిచాడు.
ఇకపోతే అదే ఫార్ములా లో ఇప్పుడు తెలుగు లో మరో మూడు చిత్రాలు రానున్నాయి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ గా వస్తున్న పింక్ రీమేక్ చిత్రం. పింక్ ఆల్రెడీ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది పైగా హిట్ చిత్రం అవ్వడం తో చాలా మంది చూసి ఉంటారు. ఇది కూడా జాను చిత్రంలా డీలా పడుతుందా లేక పవర్ స్టార్ మానియా తో నెట్టుకొస్తుందా అనేది చూడాలి.
ఇదే బాటలో హీరో రామ్ 'రెడ్' కూడా వస్తుంది. అరుణ్ విజయ్ 'తాడం' అనే చిత్రానికి రీమేక్ ఇది. ఈ చిత్రం కూడా ఆన్ లైన్ లో అందుబాటులో ఉంది కానీ ఎక్కువమంది చూసుండకపోవొచ్చు. అందువల్ల 'రెడ్' కి ఎదురు దెబ్బ తగిలే ప్రమాదం తక్కువనే చెప్పుకోవాలి. మరి 'ఇస్మార్ట్ శంకర్' తో దూకుడు మీదున్న రామ్ కి ఈ 'రెడ్' సడన్ బ్రేక్ వేయకపోతే మంచిది.
'కేర్ ఆఫ్ కంచరపాలెం' తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న వెంకటేష్ మహా, సత్య దేవ్ కాంబో లో వస్తున్న చిత్రం 'ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య' ఇది మలయాళం హిట్ చిత్రం 'మహేశ్ఇంటే ప్రతీకారం' రీమేక్.. దీని గురించి కూడా మన తెలుగు ప్రేక్షకులకు తెలిసుండకపోవొచ్చు, కాబట్టి రిజల్ట్ సినిమా విడుదలైనప్పుడే తెలుస్తుంది. మొత్తానికి ఈ ఆన్ లైన్ 'ఓ.టి.టి' ప్లాట్ ఫార్ములు వచ్చినప్పటి నుండి రీమేక్ చిత్రాలకు ఆదరణ తగ్గిపోతున్న విషయం స్పష్టమవుతుంది.