రంగస్థలంని ఆస్కార్స్ కి పంపాలి: పవన్ కళ్యాణ్

By iQlikMovies - April 14, 2018 - 09:34 AM IST

మరిన్ని వార్తలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిన్న రాత్రి జరిగిన రంగస్థలం విజయోత్సవ సభలో ఈ చిత్రాన్ని, చిత్రం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని ప్రశంసించాడు. 

ఇక ఆయన ముఖ్యంగా ఈ చిత్రాన్ని మనదేశం తరపున ఆస్కార్స్ కి పంపించాలని దానికి అందరు సహకరించాలి, ఈ అంశంలో తనవంతుగా సాధ్యపడినంత సహాయం చేస్తాను అని మాట ఇచ్చాడు.ఈ చిత్ర కథ మన దేశ సంస్కృతి, మన నేల, మన మనుషులని అద్దంపట్టేలా ఉంది అని అందుకే ఈ సినిమా గురించి తెలిసాక ఈ చిత్రాన్ని సామాన్య ప్రేక్షకుల మధ్యలోనే చూడాలి అని కోరుకున్నట్టుగా తెలిపాడు. 

అందులో భాగంగానే ఈ మధ్యనే ఈ చిత్రాన్ని వీక్షించాను అని అలాగే ఇలా ధియేటర్ లో తన చిత్రం తొలిప్రేమ చూసాక మళ్ళీ ఈ చిత్రాన్నే చూసినట్టు చెప్పాడు.ఇక ప్రతి దర్శకుడికి ఒక విజన్ ఉండాలి అని అది ఎంత బాగా తెరపైకి తీసుకురాగలిగితే అంత మంచి దర్శకుడు అవుతాడు అని.. ఆ పరంగా సుకుమార్ ఒక అద్బుతమైన దర్శకుడు అని ఆయనని మెచ్చుకున్నాడు.

ఈ సినిమా ఆస్కార్ కి ఎంపిక అయినా కాకపోయినా పవర్ స్టార్ నుండి మాత్రం ఈ సినిమాకి ఆస్కార్ స్థాయి స్టాంప్ పడిపోయింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS