పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్నాడు అంటేనే ఆ చిత్రం జయాపజయాలతో సంబంధం లేకుండా విడుదలకి ముందే బిజినెస్ పెద్ద రేంజ్ లో జరుగుతుంది. అందుకే నిర్మాతలు ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతుంటారు.
అందుకోసమే ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ పవన్ తో చేయడానికి ఉత్సాహం చూపుతున్నదట. అలాగే పవన్ కళ్యాణ్ కి రెమ్యునరేషన్ పరంగా రికార్డు స్థాయిలో సుమారు రూ 40కోట్ల మేర ఇవ్వడానికి కూడా సిద్ధం అయ్యారట.
అయితే పవన్ కళ్యాణ్ ఇక పైన సినిమాలు చేయడు అని వార్తలు వెలువడుతున్నాయి, ఎందుకంటే 2019 సాధారణ ఎన్నికలు ఉండబోతున్నాయి అనేది ప్రధాన కారణంగా చెబుతున్నారు. దీనితో పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేస్తున్న చిత్రం అయ్యాక వేరే చిత్రం చేస్తాడా లేదా అనేది మిలియన్ డాల్లర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.
ఒకవేళ పవన్ కళ్యాణ్ గనుక రూ 40 కోట్ల మేర పారితోషకం అందుకుంటే సూపర్ స్టార్ రజినీకాంత్ తరువాత అంతటి రెమ్యునరేషన్ అందుకున్న హీరోగా చరిత్రలో నిలిచిపోతాడు.