టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకునే కథానాయకుల జాబితా వేస్తే.. అందులో పవన్ పేరు ముందు వరుసలోనే ఉంటుంది. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కాబట్టి.. తన పారితోషికం 80 కోట్లకు పైమాటే. ప్రభాస్‌ని పక్కన పెడితే.. టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న స్టార్.. పవన్ కల్యాణ్. వకీల్ సాబ్ సినిమా కోసం పవన్‌కి 50 కోట్ల పారితోషికం ఇచ్చారు. మహేష్ కూడా ఇంచుమించుగా అంతే తీసుకుంటున్నాడు. అయితే ఇప్పుడు పవన్ పారితోషికం మరో పది కోట్లు పెరిగినట్టు టాక్. అంటే 50 నుంచి 60 కి చేరిందన్నమాట.
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించనుంది. ఈ సినిమా కోసం పవన్ కి ఏకంగా 60 కోట్ల పారితోషికం ఇచ్చినట్టు టాక్. ఈ సినిమా కోసం పవన్ బల్క్‌గా డేట్లు ఇచ్చేశాడట. వీలైనంత త్వరగా ఈ సినిమాని మొదలెట్టి, చక చక పూర్తి చేయాలన్నదే లక్ష్యం. ఈసినిమా అయ్యాకే... పవన్ హరి హర వీరమల్లు సెట్స్‌పైకి అడుగుపెడతాడట. హరి హర వీరమల్లుకి సైతం పవన్ 50 కోట్ల పారితోషికం తీసుకున్నట్టు తెలుస్తోంది.