సెకండ్ వేవ్ తరవాత చాలా సినిమాలొచ్చాయి. కానీ... ఏ సినిమా బాక్సాఫీసు దగ్గర పెద్దగా ప్రభావితం చేయలేకపోయింది. ఎస్.ఆర్.కల్యాణ మండపం, రాజ రాజ చోర సినిమాలే కాస్త ఫర్వాలేదనిపించాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న శ్రీదేవి సోడా సెంటర్ కూడా తస్సుమంది. సుధీర్ బాబు కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ఈ సినిమాకి భారీ ప్రచారం చేశారు. మహేష్ కూడా... మైకు పట్టుకుని ఈ సినిమా గురించి మాట్లాడాడు. ప్రభాస్ సైతం ప్రమోషన్లలో కనిపించాడు.
అయినా సరే.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ని సాధించలేదు. ఈ సినిమాకి దాదాపుగా 8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. 10 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం రూ.4.84 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.3.36 కోట్ల షేర్ ను రాబట్టాలి. ప్రస్తుతం ఏ థియేటర్లోనూ... ఈ సినిమాకి కలక్షన్లు లేవు. దానికి తోడు ఈవారం `సిటీమార్` విడుదల అవుతోంది. సిటీమార్ మాస్ సినిమా. దాని ముందు శ్రీదేవి నిలవడం కష్టమే. అంటే.. ఈ సినిమాకి దాదాపు మూడున్నర కోట్ల నష్టమన్నమాట.