టాలీవుడ్ లోనే కాదు.. సౌత్ ఇండియాలోనే అతి పెద్ద స్టార్స్ లో పవన్ కల్యాణ్ ఒకడు. తన ఫ్లాపు సినిమాల ఓపెనింగ్స్ కలక్షన్స్ సైతం.. రికార్డు బ్రేక్ లెవిల్లో ఉంటాయి. ఇక తన సినిమా హిట్టయితే.. ఆ రేంజే వేరు. అందుకే ఫ్లాపులొచ్చినా పారితోషికం తగ్గని హీరో గా పవన్ కల్యాణ్ నిలిచాడు. తన పారితోషికం ప్రస్తుతం 50 కోట్లకు పైమాటే. అయితే తొలి సినిమాకి పవన్ తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా? అక్షరాలా 5 వేలు. పవన్ తొలి చిత్రం `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి`. ఈవీవీ సత్యనారాయణ దర్శకుడు.
గీతా ఆర్ట్స్ ఈ సినిమాని నిర్మించింది. గీతా ఆర్ట్స్ అంటే సొంత సంస్థే. అందుకే పారితోషికం ఇవ్వాల్సిన అవసరం లేకుండా పోయింది. కానీ.. అల్లు అరవింద్ మాత్రం పవన్‌కి నెలకు 5 వేలు పారితోషికంగా ఇచ్చార్ట. సినిమా జరుగుతున్నంత కాలం.. నెలకు 5 వేలు ఇస్తూ వచ్చారు. ఆ తరవాత.. గోకులంలో సీతకు పవన్ 5 లక్షలు తీసుకున్నాడట. ఆసినిమా బాగా ఆడింది.
ఇక ఆ తరవాత... వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వకీల్ సాబ్ కి అత్యధికంగా రూ.50 కోట్లు అందుకున్నారు. అతి తక్కువ రోజుల్లో ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేశారు. మహా అయితే పవన్ ఇచ్చిన కాల్షీట్లు 30కి మించవని టాక్. అంటే.. రోజుకి కోటిన్నర అన్నమాట.