పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేపు ఫిలిం ఛాంబర్ లో తెలుగు చలనచిత్ర పరిశ్రమకి చెందిన 24 క్రాఫ్ట్స్ కి సంబందించిన ప్రముఖులతో కలిసి ఒక కీలక సమావేశం జరపబోతున్నట్టుగా కొద్దిసేపటి క్రితమే ఒక ప్రెస్ నోట్ విడుదల చేశాడు.
ఇవ్వన్ని పక్కన పెడితే, ఈ తరుణంలో తన అభిమానులు ఎవ్వరు సహనం కోల్పోవద్దు అని అందరు దయచేసి ఎటువంటి హింసాత్మక కార్యక్రమాలకి పాల్పడకూడదు అని విజ్ఞప్తి చేశాడు. ఇక ఈ అంశంలో తాను పేర్లు చెప్పిన ప్రముఖులు తన పైన పరువునష్టం దావా వేసే యోచనలో ఉన్నట్టు, అయినప్పటికీ తాను ఏ మాత్రం కూడా వెనుకాడకుండా ఈ అంశంలో పోరాడుతాను అని తెలిపాడు.
ఇక రేపు జరగబోయే సమావేశం తరువాత తాను అనుసరించబోయే కార్యాచరణను ప్రకటిస్తాను అని ఇప్పటికే తెలిపాడు పవన్. ఏదేమైనా పవన్ కళ్యాణ్ ని ఆయన కుటుంబాన్ని అనవసరంగా ఇందులో లాగారు అని అందరు అభిప్రాయపడుతున్నారు.
చూద్దాం.. ఈ అంశం మరెన్ని మలుపులు తిరగబోతుందో..




