పవన్ కల్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన క్షణం వచ్చేసింది. పవన్ కల్యాణ్ చేతిలో సినిమాలు పెరుగుతున్నాయే గానీ, ఆయన షూటింగుల్ని మొదలెట్టింది లేదు. ఒకొక్కటీ పూర్తి చేసుకుంటూ వస్తే తప్ప.. సినిమా వ్యవహారాలన్నీ ఓ కొలిక్కిరావు. అన్ లాన్ తరవాత షూటింగులకు అనుమతులు ఇచ్చినా పవన్ సెట్లో అడుగుపెట్టలేదు. ఎట్టకేలకు... పవన్‌కి షూటింగులపై మనసైంది. ఆదివారం ఆయన `వకీల్ సాబ్` షూటింగ్ లో పాల్గొన్నారు. బాలీవుడ్ `పింక్` ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం వకీల్ సాబ్. వేణు శ్రీరామ్ దర్శకుడు. ఇటీవలే హైదరాబాద్ లో షూటింగ్ మొదలైంది. ఇప్పుడు పవన్ సెట్లో జాయిన్ అయ్యారు. కోర్టు నేపథ్యంలో కొన్ని కీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేయాలన్నది ప్లాన్. అందుకే.. చక చక షూటింగ్ పూర్తి చేసి నవంబరు చివరి వారం నాటికి ముగించుకుని, డిసెంబరు నుంచి పబ్లిసిటీ మొదలెట్టాలని భావిస్తున్నారు.