పవన్ చేతిలో చాలా సినిమాలున్నాయిప్పుడు. వకీల్ సాబ్, క్రిష్ సినిమాతో పాటు హరీష్ శంకర్ సినిమా ఇవన్నీ లైనప్‌లో ఉన్నాయి. ఇప్పుడు `అయ్యప్పయుమ్ కోషియమ్` కూడా చేరిపోయింది. మలయాళంలో ఘన విజయం సాధించిన చిత్రమిది. ఇందులో పవన్ నటిస్తాడని ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అది ఖాయమైపోయింది. ఈ సినిమాలో పవన్ నటిస్తున్నాడని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. రెండో కథానాయకుడిగా రానా నటించనున్నారు. కాకపోతే ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు.
ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకుడు. తమన్ సంగీతం అందించనున్నాడు. వకీల్ సాబ్ పూర్తవ్వగానే.... ఈ రీమేక్ ని మొదలెట్టే అవకాశాలున్నాయి. రెండు నెలల్లో ఈ సినిమా పూర్తి చేయాలని భావిస్తున్నారు. షూటింగ్ ఎప్పుడన్నది త్వరలోనే చిత్రబృందం ప్రకటిస్తుంది.