ప‌వ‌న్ - రాజ‌మౌళి.. ఎప్పుడు?

By Gowthami - February 22, 2021 - 12:00 PM IST

మరిన్ని వార్తలు

టాలీవుడ్ కి కిర్రెక్కించే కాంబినేష‌న్లు ఇప్పుడు రంగంలో ఉన్నాయి. అందులో... మ‌హేష్ బాబు - రాజ‌మౌళి సినిమా ఒక‌టి. వీరిద్ద‌రూ క‌లిసి ఓ సినిమా చేస్తే చూడాల‌ని సినీ అభిమానులు ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నారు. ఈ కాంబో.. ఇప్పుడు కుదిరింది. `ఆర్‌.ఆర్‌.ఆర్‌` త‌ర‌వాత‌.. రాజ‌మౌళి చేసే సినిమా మ‌హేష్ బాబుతోనే. అయితే... ఇప్పుడు అంద‌రి నోటా మ‌రో ప్ర‌శ్న‌. మ‌హేష్ తో సినిమా చేస్తున్న రాజ‌మౌళి - ప‌వ‌న్ తో ఎప్పుడు జ‌ట్టు క‌డ‌తాడు? అని. ప‌వ‌న్ తో సినిమా చేసే అవ‌కాశం కోసం తాను ఎదురు చూస్తున్నాన‌ని ఇది వ‌ర‌కెప్పుడో.. రాజ‌మౌళి స‌భాముఖంగానే ప్ర‌క‌టించాడు. అయితే అదెప్పుడ‌న్న‌దీ మిలియ‌న్ డాల‌ర్ల ప్రశ్న‌. రాజ‌మౌళి క‌థ చెబుతానంటే.. ఏ హీరో వ‌ద్దంటాడు? ప‌వ‌న్ కూడా అందుకు రెడీనే. కానీ ప‌వ‌న్ కి త‌గిన క‌థ కావాలి క‌దా.

 

ఓ గుడ్ న్యూస్ ఏమిటంటే.. ప‌వ‌న్ కోసం విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఓ క‌థ సిద్ధం చేస్తున్నార్ట‌. విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌థ‌ల‌తోనే.. రాజ‌మౌళి సినిమాలు తీస్తార‌న్న విష‌యాన్ని ప్ర‌త్యేకంగా గుర్తు చేయాల్సిన అవ‌స‌రం లేదు. విజ‌యేంద్ర ప్ర‌సాద్ కి సైతం.. ప‌వ‌న్ అంటే ప్ర‌త్యేక‌మైన అభిమానం. ఆ ఇష్టంతోనే.. ప‌వ‌న్ కోసం ఓ క‌థ రాస్తున్న‌ట్టు టాలీవుడ్ టాక్‌. అయితే ఈ క‌థ రాజ‌మౌళి కోస‌మా? లేదంటే మ‌రో ద‌ర్శ‌కుడి కోసం త‌యారు చేస్తున్నారా? అనేది తెలియాల్సివుంది.

 

ప‌వ‌న్ కొంత‌మంది ద‌ర్శ‌కుల‌తో సినిమాలు చేయ‌డానికి రెడీ అయ్యాడు. నిర్మాత‌ల ద‌గ్గ‌ర అడ్వాన్సులూ తీసుకున్నాడు. వాళ్లెవ‌రైనా.. ప‌వ‌న్ కోసం క‌థ త‌యారు చేయ‌మ‌ని, విజ‌యేంద్ర ప్ర‌సాద్ ని సంప్ర‌దించారా? అన్న‌ది తెలియాల్సివుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS