Pawan Kalyan: పవన్‌కల్యాణ్‌ సినిమాకి ముహూర్తం ఫిక్స్

మరిన్ని వార్తలు

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ , దర్శకుడు సుజిత్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అధికారిక ప్రకటన చేశారు. ఈ సినిమాలో పవర్‌స్టార్‌ గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో కనిపించనున్నారని టాక్ . జపాన్‌, ముంబయి నేపథ్యంలో ఈ కథ సాగే అవకాశం ఉందని తెలుస్తోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రూపుదిద్దుకోనున్న ఈసినిమా కోసం సుమారు రూ.100 కోట్ల బడ్జెట్‌ వెచ్చించే అవకాశం ఉందని సమాచారం.

 

కాగా ఈ సినిమా ముహూర్తం ఫిక్స్ అయ్యింది. జనవరి 30న ఈ సినిమాకి కొబ్బరికాయ్ కొడతారు. ఆ రోజు ఈ చిత్రానికి సంబధించిన మరిన్ని వివరాలు తెలుస్తాయి. ప్రస్తుతం వీరమల్లు సినిమా పనుల్లో వున్నారు పవన్. ఈ సినిమా దాదాపు చివరి దశకు వచ్చింది. సుజిత్ సినిమా కూడా త్వరలోనే సెట్స్ పైకి తీసుకెల్తారు. అలాగే హరీష్ శంకర్ సినిమా కూడా పవన్ పైప్ లైన్ లో వుంది. ఈ చిత్రం మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS