ఫేక్ న్యూస్‌పై విజయ్ దేవరకొండ చేస్తున్న పోరాటానికి టాలీవుడ్ నుంచి భారీ మద్దతు లభించింది. మహేష్ బాబు, చిరంజీవి లాంటి స్టార్లు ఈ విషయంపై విజయ్‌కి అండగా నిలిచారు. ఫేక్ వెబ్ సైట్ పై తమదైన పోరాటానికి నాంది పలికారు. టాలీవుడ్ అంతా ఒక్కతాటిపైకి వచ్చింది. అటు మా అసోసియేషన్, ఇటు ఫిల్మ్ ఛాంబర్, గిల్డ్ కూడా.. విజయ్‌కి మద్దతు పలికాయి. అయితే పవన్ కల్యాణ్ మాత్రం ఈ విషయంపై మౌనంగా ఉన్నాడు. తన నుంచి ఎలాంటి స్పందనా లేదు.
నిజానికి ఫేక్ న్యూస్‌లూ, నెగిటీవ్ వార్తల విషయంలో ముందు నుంచీ బాగా నలిగిపోయిన, పోతున్న కథానాయకుడు పవన్ కల్యాణే. పవన్‌పై ఎవరు ఎలాంటి ఎదురుదాడికి దిగినా - ఆ గాసిప్ వెబ్ సైట్ పెద్దది చేసి చూపించేది. వంతపాడేది. పవన్ ని తిట్టినవాళ్లందరినీ సెలబ్రెటీలను చేసేది. పవన్ మూడు పెళ్లిళ్ల విషయంలో ఇప్పటికీ కెలుకుతున్న గాసిప్ వెబ్ సైట్ అదొక్కటే. కొంతకాలం క్రితం ఫేక్ న్యూస్‌లూ, వెబ్ సైట్ల వ్యవహారాలపై పవన్ గళం విప్పాడు. ఆ సమయంలో మెగా ఫ్యామిలీ అంతా పవన్‌కి అండగా నిలిచింది. అయితే స్టార్ హీరోలు ఎవరూ పవన్‌కి తోడుగా రాలేకపోయారు. ఇప్పుడు విజయ్ వంతు వచ్చింది. అయితే ఈసారి పరిశ్రమ అంతా ఏకం అయ్యింది. ఇలాంటప్పుడు పవన్ కూడా స్పందిం ఉంటే ఆ లెక్క వేరుగా ఉండేది. బహుశా.. తన విషయంలో పరిశ్రమ ఒక్క తాటిపై రాలేనందుకు పవన్ ఇప్పుడు లైట్‌తీసుకుని ఉండొచ్చు. కాకపోతే.. ఇలాంటి హెచ్చు తగ్గులు వదిలేసి, పోరాటం చేయగలిగితే సరైన ఫలితాలు వస్తాయి. పరిశ్రమకూ ఓ గొప్ప సంకేతం పంపినట్టు అయ్యేది.