సుకుమార్‌ కన్నీటి ‘లెక్క’: లేకపోవడమంటే.!

మరిన్ని వార్తలు

దర్శకుడు సుకుమార్‌ ఎంతో ఎమోషనల్‌. స్వతహాగా లెక్కల మాస్టార్‌ కావడంతో, ఆయన దర్శకత్వంలో రూపొందే సినిమాల్లో అన్ని లెక్కలూ పక్కాగా వుంటాయి. సుకుమార్‌ మాట్లాడినా, సుకుమార్‌ ఏదన్నా పనిచేసినా, దానికో లెక్క వుంటుందని చెబుతుంటారు ఆయన సన్నిహితులు. తాజాగా సుకుమార్‌, సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టాడు. లాక్‌డౌన్‌కి సంబంధించిన పోస్ట్‌ అది. కానీ, అసలు విషయం వేరే వుంది. అది తన ఆత్మీయ స్నేహితుడి గురించి సుకుమార్‌ మనసులోని భావం.

 

ఆద్యంతం ఆ లేఖలో, ఆ స్నేహితుడి మీద తనకున్న అమితమైన అభిమానాన్ని చాటుకున్నాడు సుకుమార్‌. ‘బావగాడు’ అంటూ సుకుమార్‌ తన సన్నిహితుడు, మేనేజర్‌ అయిన ప్రసాద్‌ గురించి రాసిన వైనం, చదివినవాళ్ళ కళ్ళు చెమర్చేలా చేస్తున్నాయి. మనిషి లేకపోవడమంటే ఏంటో, సుకుమార్‌ తన మాటల్లో చూపించాడు. ప్రతి ఒక్కరూ, తాము కోల్పోయిన తమ ఆత్మీయుల్ని ఈ సందర్భంగా ఇంకోసారి గుర్తు చేసుకోవడం ఖాయం. తన స్నేహితుడు జీవించి లేడన్న వాస్తవాన్ని సుకుమార్‌ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారనే విషయం ఆయన రాసుకున్న మాటల్ని చూస్తే అర్థమవుతుంది. స్నేహమంటే అదో చులకన భావం అయిపోయింది ఈ రోజుల్లో చాలామందికి. అలాంటిది, స్నేహమంటే ప్రాణం.. అన్నంతగా సుకుమార్‌ చెప్పిన ఈ కొత్త ‘లెక్క’, మరోమారు స్నేహంలోని గొప్పతనాన్ని అందరికీ తెలియజేస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS