పవన్‌కళ్యాణ్‌కున్న లక్షలాదిమంది అభిమానుల్లో ఈ 20 లక్షల మంది అభిమానులు చాలా ప్రత్యేకం. అందుకే పవన్ కళ్యాణ్ వారిని దీపాలుగా అభివర్ణించారు. సినిమా హీరోగానే కాకుండా, వ్యక్తిగా ఆయన వ్యక్తిత్వం బాగా నచ్చింది ఈ అభిమానులకి. అందుకే తమ అభిమానాన్ని 'పవనిజం' అనే ఇజంగా క్రియేట్ చేసుకున్నారు ఈ ఇరవై లక్షల మంది. సాధారణంగా సెలబ్రిటీస్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చాలా అరుదుగా మాత్రమే ట్విట్టర్‌లో కనిపిస్తూ ఉంటారు. అలాంటిది ఆయనకి ఈ స్థాయిలో అభిమానం అంటే చిన్న విషయం కాదు. అదే పవన్ స్టామినా. 'జనసేన' పార్టీని స్థాపించిన కొత్తల్లో ఆయన ఒక్కడే. ఆ ఒక్కడే ఇప్పుడు 20 లక్షల దీపాలుగా వెలుగులు విరజిమ్ముతున్నాయి. ఈ అభిమానానికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం పవన్ కళ్యాన్, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. పలు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కీర్తి సురేష్, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమిళ యంగ్ డైరెక్టర్ అనిరుధ్ స్వీట్ అండ్ లవ్‌లీ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాని 2018 జనవరి 10న విడుదల చేయనున్నారు.