కరోనా కారణంగా షూటింగులు వాయిదా పడడంతో పవన్ కల్యాణ్ మూడ్ సినిమాల నుంచి రాజకీయాలవైపు మళ్లింది. ఆయన సినిమాల నుంచి పూర్తిగా స్విచ్చాఫ్ అయిపోయారు. ఆ విషయం ఆయన గెడ్డాన్ని చూస్తే తెలిసిపోతుంది. ఆమధ్య కాస్త స్లిమ్ గా కనిపించిన పవన్.. ఇప్పుడు లావయ్యాడు. పైగా.. లుక్ కూడా మారిపోయింది. పైగా పవన్ ఓ దీక్షలో కూడా ఉన్నాడు. దాని కోసమైనా గెడ్డం పెంచాల్సివస్తోంది. మరోవైపు `వకీల్ సాబ్` షూటింగ్ కోసం దిల్ రాజు ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో పవన్ మళ్లీ సినిమాలకు సన్నద్ధమవ్వడానికి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇప్పుడు పవన్ తన ఫిట్ నెస్‌పై దృష్టి పెట్టాడట.
అక్టోబరులో వకీల్ సాబ్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈలోగా సినిమాకి తగ్గట్టుగా మారాలని పవన్ భావిస్తున్నాడు. అక్టోబరు నుంచి.. ఇక వరుసగా షూటింగులతో పవన్ బిజీ కాబోతున్నాడు. ముందు అనుకున్న ప్రకారం వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి చేసి, ఆ తరవాత క్రిష్ సినిమాలో పాలు పంచుకోబోతున్నాడు. పవన్ తన కోసం ప్రత్యేకంగా ఓ ట్రైనర్ ని నియమించుకున్నట్టు తెలుస్తోంది. తన గైడెన్స్ తోనే.. డైట్, ఫిట్‌నెస్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. మరి కొద్ది రోజుల్లో పవన్ ని కొత్తగా చూడడం ఖాయంలానే కనిపిస్తోంది.