గోపాల గోపాల, కాటమరాయుడు.. ఈ సినిమాలకు దర్శకత్వం వహించారు డాలీ. ఇప్పుడు పవన్ తో మరో సినిమా చేస్తారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ సినిమా దాదాపుగా ఖాయం అయ్యింది. పవన్ - డాలీల సినిమా త్వరలోనే పట్టాలెక్కబోతోంది. అయితే.. ఇందులో.. పవన్ హీరో కాదు. ఆయన కేవలం నిర్మాతగా వ్యవహరిస్తారు. మరో మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తారు.
వరుణ్‌తో ఓ సినిమా చేయాలని పవన్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. కానీ.. సరైన కథ దొరకలేదు. ఈమధ్య డాలీ పవన్ కి ఓ కథ వినిపించడం, అది.. తన కంటే, వరుణ్ కి బాగుంటుందని పవన్ భావించడంతో.. పవన్ - డాలీల సినిమా... ఖాయమైంది. త్వరలోనే ఈసినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుంది. వరుణ్ తో పాటు.. రామ్ చరణ్ తో కూడా ఓ సినిమా చేయాలని భావిస్తున్నాడు పవన్. మరి ఆ సినిమా ఎప్పుడు ఉంటుందో?