పవన్ కల్యాణ్ - త్రివిక్రమ్ కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. పవన్ - త్రివిక్రమ్ సినిమా అంటే అంచనాలు భారీగా ఉంటాయి. జల్సా, అత్తారింటికి దారేది తరవాత వస్తున్న సినిమా కాబ్టటి.. అవి మరింతగా పెరిగే అవకాశం ఉంది. కుటుంబ కథలకు యాక్షన్ జోడించడంలో త్రివిక్రమ్ దిట్ట. ఈసారీ అదే ఫార్ములా పాటిస్తున్నాడట త్రివిక్రమ్. ఇదో రివైంజ్ డ్రామా అని తెలుస్తోంది. తండ్రి చావుకి కారణమైన వాళ్లపై కథానాయకుడు ఎలా పగ తీర్చుకొంటాడన్నది త్రివిక్రమ్ తన స్టైల్లో చెబుతున్నాడట. రివైంజ్ డ్రామా అనేది తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచీ ఉంది. కాకపోతే.. త్రివిక్రమ్ ఈ కథని ఎలా డీల్ చేయబోతున్నాడన్నది ఆసక్తికరం.