నిన్న అర్ధరాత్రి నుండి ఎక్కడ చూసినా కాటమరాయుడి గురించే చర్చ. తెల్లవారుజామున కొన్ని స్పెషల్ షోస్ క్యాన్సిల్ అయిన మార్నింగ్ షోస్ టైంకి పడిపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ హడావిడి ఒక పక్కన జరుగుతుంటే, ఇంకొక వైపు పవన్ తన కొత్త చిత్రం మొదలుపెట్టే పనిలో పడ్డాడు. అన్ని అనుకున్న విధంగా జరిగితే, పవన్-త్రివిక్రమ్ ల సినిమా ఏప్రిల్ 7వ తేదిన మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.
ఏప్రిల్లో మొదలుపెట్టి సెప్టెంబర్ లో షూటింగ్ ముగించేయాలి అనే ప్లాన్ తో ఉన్నట్టు వినికిడి. అయితే ఇంత త్వరగా మొదలుపెట్టడానికి కారణం, పవన్ రాజకీయాల్లో యాక్టివ్ అవ్వనుండడమే అని పవన్ సన్నిహిత వర్గాల ద్వారా జరుగుతున్న ప్రచారం.