సమస్యల్లో ఉన్న ప్రజల దగ్గరికి తాను వెళ్తాను అంటూ ప్రకటించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇక అదే పనిలో నిమగ్నంకానున్నాడు.
తెలియవస్తున్న వార్తల ప్రకారం, ఈ నెల 30 తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారిని కలవనున్నాడు.
కొన్ని నెలల క్రితం ఆయన ఈ విషయాన్ని తన పార్టీ అయిన జనసేన ద్వారా అందరికి తెలిసేలా చేయడంతోనే అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఉద్దానంలో చేయవలసిన అత్యవసర కార్యక్రమాలకి రూపకల్పన చేసింది. అయితే పవన్ ఈ సారి తన వెంట విదేశాల నుండి వచ్చిన వైద్య బృందంతో ఈ ప్రాంతాన్ని సందర్శించనున్నాడు.
ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా షూటింగ్ దశలో ఉంది. ఏదేమైనా పవన్ ముందే చెప్పినట్టుగా తన టార్గెట్ 2019 కి చేరువయ్యేలా ప్రయాణం మొదలుపెట్టనున్నాడు.