పవన్ కల్యాణ్ చేతిలో చాలా సినిమాలున్నాయి. కానీ.. చేసే టైమ్, ఓపిక.. పవన్‌కి లేవు. హరిహర వీరమల్లు సినిమా కూడా పవన్ పొలిటికల్ షెడ్యూల్ వల్ల ఆగిపోయింది. అదెప్పుడు మొదలవుతుందో తెలీదు. మరోవైపు హరీష్ శంకర్, సురేందర్ రెడ్డిలతో సినిమాలు చేస్తానని మాటిచ్చాడు. సముద్రఖనితో ఓ రీమేక్ ఉంది. ఇవన్నీ ఎప్పుడు మొదలవుతాయో చెప్పలేని పరిస్థితి.
అయితే ఇప్పుడు ఈ సినిమాల్లో ఒకట్రెండు పక్కన పెట్టేద్దాం అని పవన్ భావిస్తున్నాడని తెలుస్తోంది. హరీష్ శంకర్ లేదా సురేందర్ రెడ్డిలలో ఓ సినిమాని క్యాన్సిల్ చేసుకోవాలని పవన్ అనుకుంటున్నాడట. దాదాపుగా సురేందర్ రెడ్డి సినిమానే ఆగిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే.. హరీష్ ఎప్పుడో కథ రెడీ చేసేశాడు. హరీష్‌తో సినిమా అంటే పక్కా మాస్ మసాలా ఉంటుంది. మినిమం గ్యారెంటీ ఉంటుంది.కాబట్టి... పవన్.. సురేందర్ రెడ్డి సినిమా పక్కన పెట్టే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయి. అయితే ఈలోగా... వేణు ఉడుగుల కూడా ఓ కథ పట్టుకొని తిరుగుతున్నాడు. అది బాగా నచ్చేస్తే.. అప్పుడు హరీష్ సినిమా కూడా ఉండకపోవొచ్చన్నది మరో టాక్. మొత్తానికి పవన్ ఇప్పుడు సినిమాల్ని తగ్గించుకునే పనిలో ఉన్నాడన్నది మాత్రం వాస్తవం. మరి.. ఈ లిస్టులో ఏ సినిమాలుంటాయో చూడాలి.