పవన్‌ ట్రిపుల్‌ ధమాకా!

మరిన్ని వార్తలు

పవన్‌ కళ్యాణ్‌ - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇది క్రేజీ కాంబినేషనే కాదు. క్రేజీయెస్ట్‌ కాంబినేషన్‌. అందుకే ఈ కాంబినేషన్‌లో సినిమా అంటే అంత క్రేజ్‌ జనానికి. ఈ కాంబినేషన్‌లో ఇంతవరకూ ఫెయిల్యూరే లేదు. అన్నీ సూపర్‌ డూపర్‌ హిట్సే. సంచలనాలే. అలాంటిది ఇప్పుడు రాబోతున్న ఈ కొత్త సినిమా మరింత సంచలనం కానుంది. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ కనీ వినీ ఎరుగని రీతిలో జరుగుతోంది. సినిమా కూడా చాలా బాగా వచ్చిందట. ఇంతవరకూ కామ్‌గా షూటింగ్‌ జరుపుకుంది ఈ సినిమా. ఇప్పుడిప్పుడే ఈ సినిమాకి సంబంధించిన న్యూస్‌ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్న న్యూస్‌ ఊపందుకుంటున్నాయి. కీర్తి సురేష్‌, అనూ ఇమ్మాన్యుయేల్‌ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంకో పక్క పవన్‌ రాజకీయాల్లోనూ యాక్టివ్‌ అవుతున్నారు. రాజకీయాలు అంటే ఆ కోణంలో కాకుండా, మానవతా కోణంలో ఉద్ధానం కిడ్నీ సమస్యపై స్పందించాడు. ఆ సందర్భంగా ఈ రోజు హార్వర్డ్‌ వైద్యులను ఉద్ధానం తీసుకొచ్చాడు పవన్‌ కళ్యాణ్‌. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో ఈ రోజు హార్వర్డ్‌ వైద్యులతో కలిసి పవన్‌ కళ్యాణ్‌ భేటీ కానున్నాడు. ఇదిలా ఉండగా, నితిన్‌ హీరోగా పవన్‌ కళ్యాణ్‌ నిర్మాణంలో తెరకెక్కుతోన్న సినిమా కూడా సెట్స్‌ మీదికెళ్లింది. ఈ సినిమాకి త్రివిక్రమ్‌ కథనందిస్తుండగా, కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ రకంగా ఇటు హీరోగానూ, రాజకీయాల్లోనూ, నిర్మాణంతోనూ పవన్‌ బిజీగా ఉన్నాడు. పవన్‌ ట్రిపుల్‌ ధమాకా న్యూస్‌తో హాట్‌ హాట్‌గా వార్తల్లో నిలుస్తుండడంతో ఫ్యాన్స్‌ ఆనందానికి అవధుల్లేవు. 

 

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS