ఫిలిం ఇండస్ట్రీ లో తనకు ఏది నచ్చితే అది నచ్చింది అని చెప్పే అలవాటు ఉన్న అతితక్కువ మందిలో పోసాని కృష్ణమురళి ఒకరు.
ఇక ఆయన ఈ మధ్య సంచలనం రేపుతున్న డ్రగ్స్ కేసు పై తనదైన శైలిలో స్పందించారు. ఈ అంశం పై ఒక న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో డ్రగ్స్ విచారణకి అందరు తప్పనిసరిగా సహకరించాల్సిందే అని స్పష్టం చేశారు.
ఇక ఈ డ్రగ్స్ నేపధ్యంలో సినీ ఇండస్ట్రీ వారిని టార్గెట్ చేస్తున్నారన్న కారణంగా సినీ ఇండస్ట్రీ హైదరాబాద్ నుండి వైజాగ్ కి తరలిపోనుంది అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి అని ప్రశ్నించగా-
ఈ కారణం చెప్పి ఎవరు వెళ్ళిపోయినా తాను మాత్రం తెలంగాణ రాష్ట్రం విడిచి వెళ్ళను అని అలాగే తనకి తెలంగాణ రాష్ట్రం బాగా నచ్చింది అని అందరు వెళ్ళిపోయినా తాను మాత్రం ఇక్కడే ఉంటూ తెలంగాణ సినిమాలకి పనిచేస్తాను అని కుండబద్దలు కొట్టేశాడు.
ఫిలిం ఇండస్ట్రీ తరలిపోవడం అంటూ జరిగితే అది చలనచిత్ర పరిశ్రమ తీవ్రంగా చితికిపోతుంది అని తెలిపాడు. అయిన ఈ డ్రగ్స్ సమస్యకి తెలంగాణ కి అసలు సంబందం లేదు అని తేల్చేశాడు.