వకీల్ సాబ్ తో పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చేశాడు. కరోనా లేకపోతే... ఈపాటికి `హర హర వీరమల్లు` కూడా వచ్చేసేదే. కానీ....కరోనా దెబ్బతో వెనక్కి వెళ్లింది. సంక్రాంతికి `భీమ్లా నాయక్ `వచ్చేస్తుంది. ఆ తరవాత `హరి హర వీరమల్లు` రెడీ అవుతుంది. ఈలోగా హరీష్ శంకర్ సినిమా మొదలైపోతుంది. ఆ తరవాత.. కూడా చాలా లైనప్ ఉంది. కానీ.. పవన్ ఇప్పుడు కొత్త కథలపై దృష్టి పెట్టే మూడ్ లో లేడట.
ప్రస్తుతానికి కొత్త కథలు, కొత్త సినిమాలకు పవన్ రెడీగా లేడని టాక్. హరీష్ శంకర్ సినిమా తరవాత.. మళ్లీ సినిమాలకు గ్యాప్ తీసుకోబోతున్నాడని తెలుస్తోంది. ఏపీ లో రాజకీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. ఈ తరుణంలో.. పవన్ సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉండడం వీలయ్యేలా లేదు. పవన్ ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉంటే కుదరని పని. పైగా ప్రతి పక్షాలు పవన్ ని టార్గెట్ చేస్తాయి. పవన్ ని పార్ట్ టైమ్ రాజకీయ నాయకుడంటూ విమర్శిస్తాయి. ఇవన్నీ తిప్పి కొట్టాలంటే పవన్ ఇప్పుడు ఫుల్ టైమ్ రాజకీయాలపై దృష్టి పెట్టాలి. అందుకే చేతిలో ఉన్న సినిమాలు వీలైనంత త్వరగా పూర్తి చేయాలనుకుంటున్నాడు. నిజానికి సురేందర్ రెడ్డి తో సినిమా ఒకటి లైనప్ లో ఉంది. అది చేసే అవకాశం కూడా పవన్ కి లేదట. బండ్ల గణేష్ కూడా పవన్ డేట్ల కోసం తిరుగుతున్నాడు. ఈసారి తనకీ ఛాన్స్ దొరికే అవకాశం లేదని టాక్.