పవన్ కళ్యాణ్ మైత్రీ మూవీస్ మేకర్స్ బ్యానర్లో సినిమా చేయాల్సి ఉందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ బ్యానర్ నుండి పవన్‌కి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేసినట్లు సమాచారమ్. అయితే ఇంతవరకూ అటు నుంచి ఈ విషయంలో స్పందన రాలేదు. అలాగే అధికారిక ప్రకటన కూడా అందలేదు. అయితే తాజా అప్డేట్ ప్రకారం 'కందిరీగ' సినిమా డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్‌తో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో పవన్ కళ్యాణ్ సినిమా చేేయబోతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి ఇది ఎంతవరకూ నిజమో తెలీదు కానీ, సోషల్ మీడియాలో ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ అయ్యింది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమాతో బిజీగా ఉన్నాడు. తాజాగా ఈ చిత్రానికి 'అజ్ఞాతవాసి' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ సినిమా నిర్మాణం దాదాపు చివరి దశకు చేరుకుంది. అయితే ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాన్ చేయబోయే సినిమా ఏంటనే విషయంపై సర్వత్రా ఆశక్తి నెలకొంది. అయితే పవన్ చేయాల్సిన సినిమాలు మరి కొన్ని ఉన్నాయి. వాటిలో ఎ.ఎం.రత్నం నిర్మాణంలో పవన్ గతంలోనే ఓ సినిమాకి కమిట్ ఆయ్యాడు. తర్వాత అన్నయ్య చిరంజీవితో మల్టీ స్టారర్ కూడా ప్లానింగ్‌లో ఉంది. ఇవి కాక పవన్ ఇంకా దేనికి కమిట్ అయ్యాడో కొంత సస్పెన్స్ కూడా నెలకొంది. ఏది ఏమైనా మైత్రీ మూవీస్ బ్యానర్లో పవన్ చేయబోయే సినిమా అయితే ప్రస్తుతం వార్తల్లో నిలిచింది.
ఇవన్నీ కాక చిరంజీవి 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి'లోనూ ఓ కీలక పాత్రలో పవన్ నటిస్తున్నాడంటూ మరో పక్క ప్రచారం జరుగుతోంది. సినిమా విషయాలు ఇలా ఉండగా, ఈ సినిమా తర్వాత పవన్ రాజకీయాల్లో యాక్టివ్‌గా పాల్గొననున్నారు. సో 'అజ్ఞాతవాసి' తర్వాత పవన్ చేయాల్సిన సినిమాలు, రాజకీయ కార్యకలాపాలు చాలానే ఉన్నాయి. వీటన్నింటినీ పవర్‌స్టార్ ఎలా మేనేజ్ చేస్తాడో! ఎందులో ఎంత పవర్ చూపిస్తాడో చూడాలిక.