టాలీవుడ్ లో మళ్లీ షూటింగుల కళ కళ మొదలైంది. నాగార్జున ఇది వరకే సెట్లో అడుగుపెట్టేశాడు. మహేష్ బాబు కూడా షూటింగ్ మూడ్ లోకి వచ్చేశాడు. చిరంజీవి `ఆచార్య` షూటింగ్ త్వరలో మొదలు కానుంది. ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా షూటింగులకు సై అంటున్నాడు.
పవన్ చేతిలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. పవన్ త్వరపడితే గానీ అవన్నీ పూర్తవ్వవు. ముందుగా `వకీల్ సాబ్ ` పని పట్టాలి. `పింక్` రీమేక్ గా వస్తున్న ఈ సినిమాకి మరో 20 రోజుల షూటింగ్ బాకీ ఉంది. అవన్నీ పవన్ ఫ్లాష్ బ్యాక్ కి సంబంధించిన సన్నివేశాలే. అక్టోబరులోనే వకీల్ సాబ్ షూటింగ్ మొదలు కానున్నదని టాక్. ముందు పవన్ లేని సన్నివేశాల్ని పూర్తి చేస్తార్ట. ఆ తరవాత పవన్ కూడా చేరతాడట. నవంబరు నాటికి ఫస్ట్ కాపీ రెడీ చేయాలని దిల్ రాజు భావిస్తున్నారు. ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నాడట పవన్. సంక్రాంతికి గనుక వకీల్ సాబ్ వస్తే - ఫ్యాన్స్ కి పండగే. నవంబరులోనే క్రిష్ సినిమా కూడా మొదలెడతాడని ప్రచారం జరుగుతోంది.