ప‌వ‌న్ సినిమాతో 40 కోట్ల లాభం?

మరిన్ని వార్తలు

సినిమా అనేది వ్యాపారం. ఎలా తీసినా, ఎవ‌రితో తీసినా.. అంతిమంగా లాభం ముఖ్యం. ఓ సినిమా పెట్టుబడి తిరిగి సంపాదించుకోవ‌డం అనేది ఈ రోజుల్లో మాట‌లు కాదు. విడుద‌ల‌కు ముందే లాభాలు చూశారంటే అది అద్భుత‌మే. `వ‌కీల్ సాబ్‌` విష‌యంలో అదే జ‌రుగుతోంది. సుదీర్ఘ విరామం త‌ర‌వాత‌... ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎంట్రీ ఇస్తున్న సినిమా ఇది. దిల్ రాజు నిర్మాత‌. అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే ఈ సంక్రాంతికి విడుద‌ల కావాల్సింది.

 

అయితే.. మార్చికి వాయిదా ప‌డిపోయింది. అయినా.. దిల్ రాజు హ్యాపీనే. ఎందుకంటే ఈ సినిమా ఈ సినిమాతో ఇప్ప‌టికే దిల్ రాజు త‌న టార్గెట్ ని రీచ్ అయిపోయాడు. వ‌కీల్ సాబ్ సినిమా ద్వారా దిల్ రాజు దాదాపు 40 కోట్ల లాభం సంపాదించ‌బోతున్నాడ‌న్న‌ది ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌. ఈసినిమా పెట్టుబ‌డి దాదాపు 90 కోట్ల‌ని తెలిసింది. ఈ 90 కోట్లు థియేట‌రిక‌ల్ రిలీజ్ ద్వారా దిల్ రాజు సొంతం చేసుకునే ఛాన్స్ వుంది.

 

మ‌రో 50 కోట్లు నాన్ థియేట‌రిక‌ల్ రైట్స్ నుంచి రాబ‌ట్ట‌బోతున్నాడ‌ట‌. అంటే.. 90కోట్ల సినిమాకి 130 కోట్ల రాబ‌డి. ఆ లెక్క‌న చూస్తే 40 కోట్ల లాభం. ఇవ‌న్నీ వ‌డ్డీలు క‌లుపుకున్న లెక్క‌లే. సినిమా సుడి బాగుంటే మ‌రో 10 కోట్ల వ‌ర‌కూ లాభం రావొచ్చ‌ని అంటున్నారు. ఎటు చూసినా 40 కోట్ల లాభానికైతే డౌటే లేదు. ఈ క‌రోనా కాలంలో ఓ సినిమాకి ఇంత లాభం వ‌స్తోందంటే.. మామూలు విష‌యం కాదు. ప‌వ‌న్‌ స్టామినా అలాంటిది మ‌రి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS