'సైరా'కి పవర్‌ స్టార్‌ వాయిస్‌ ఓవర్‌!

మరిన్ని వార్తలు

ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా 'సైరా' మేకింగ్‌ వీడియో రిలీజ్‌ చేసి, మెగా ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్‌ ఇచ్చారు 'సైరా నరసింహారెడ్డి' టీమ్‌. ఇక త్వరలో అంటే ఈ నెల 20న టీజర్‌ విడుదల చేయనున్నారు. మేకింగ్‌ వీడియో చూసి ఆనందంతో ఫ్యాన్స్‌ ఉబ్బి తబ్బిబ్బయిపోయారు. ఇక టీజర్‌లో ఇంకెంత అద్భుతాలు చూపిస్తారో అంటూ సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టీజర్‌లో ఊహకందని ఎన్నో సర్‌ప్రైజ్‌లు పొందు పరిచారట.

 

ముఖ్యంగా టీజర్‌ పవర్‌ స్టార్‌ వాయిస్‌ ఓవర్‌తో మొదలు కావడం ఆసక్తిని పెంచుతోంది. మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతోన్న సినిమా, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ భారీ నిర్మాణం, పవర్‌ స్టార్‌ వాయిస్‌ ఓవర్‌.. ఇలా ఇదంతా చూస్తుంటే, 'సైరా' మెగా పవర్‌ ప్యాక్‌డ్‌ యాక్షన్‌ మూవీ అనడం అతిశయోక్తి కాదేమో. ఇక పవర్‌ స్టార్‌ వాయిస్‌ విషయానికి వస్తే, తొలిసారిగా చిరంజీవి సినిమాకి పవన్‌ కళ్యాణ్‌ వాయిస్‌ ఓవర్‌ ఇస్తున్నారు. 'శంకర్‌ దాదా జిందాబాద్‌' సినిమాలో అన్నయ్య కోసం తమ్ముడు ఓ యాక్షన్‌ సీన్‌లో నటించారు. కానీ, వాయిస్‌ ఇవ్వడం మాత్రం ఇదే తొలిసారి. ఈ వాయిస్‌ చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతోందట.

 

మెగాస్టార్‌తో కలిసి, పవర్‌ స్టార్‌ వాయిస్‌ ఇస్తున్న ఫోటో ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ఆ పక్కనే 'సైరా' డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి కూడా ఉండడం, 'సైరా'కి పవర్‌ స్టార్‌ వాయిస్‌ ఇస్తున్నారని కన్‌ఫామ్‌ అయిపోయింది. టీజర్‌పై మెగా అభిమానులు చాలా చాలా అంచనాలతో ఉన్నారు. ఇంతవరకూ 'సైరా' విషయంలో సురేందర్‌ రెడ్డి అంచనాల్ని ఏమాత్రం తక్కువ చేయలేదు. అంతకంతకూ పెంచుతూనే ఉన్నారు. ఈ అంచనాలు మరింత పెరిగేలా టీజర్‌ ఉండబోతుందని ఆశిద్దాం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS