2021 సంక్రాంతికి వకీల్ సాబ్ వస్తుందని ఆశ పడ్డారు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్. పవన్ సినిమా సంక్రాంతికి వస్తే... ఆ హంగామా మామూలుగా ఉండదు. కానీ ఈ సీజన్ ని వకీల్ సాబ్ మిస్సయ్యాడు. ఈ సినిమా వేసవికి షిఫ్ట్ అయిపోయింది. అయితే 2022 సంక్రాంతి మాత్రం పవన్ మిస్ అవ్వడట. వచ్చే సంక్రాంతికి పవన్ సినిమా విడుదల అవ్వడం ఖాయమని తెలుస్తోంది.
ఇప్పటి నుంచే పవన్ ఆ ప్రయత్నాలు మొదలెట్టాడని టాక్. వచ్చే సంక్రాంతికి పవన్ సినిమా ఒకటి రాబోతోంది. ప్రస్తుతం పవన్ - క్రిష్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. దీనికి `విరూపాక్ష` అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా ఇది. దీన్ని 2022 సంక్రాంతికి విడుదల చేయాలన్నది క్రిష్ ప్లాన్. భారీ బడ్జెట్ సినిమా ఇది. అంతా రాబట్టుకోవాలంటే మంచి సీజన్ కావాలి. తెలుగు సినిమాకి సంక్రాంతికంటే మంచి సీజన్ ఎప్పుడు దొరుకుతుంది? అందుకే ఈ సినిమాని సంక్రాంతికి తీసుకురావాలనుకుంటున్నార్ట.