ప‌వ‌న్ చేతుల్లోంచి జారిపోయిన రీమేక్.

మరిన్ని వార్తలు

 ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో సినిమా అంటే నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు ఎగిరి గంతేస్తారు. ఎందుకంటే ప‌వ‌న్ క్రేజ్ అలాంటిది. ప‌వ‌న్ తో సినిమా మొద‌లైతే చాలు, అడ్వాన్సులు వ‌రుస క‌డ‌తాయి. ముందే భారీ లాభాల‌తో బ‌య‌ట‌ప‌డొచ్చు. ఇవ‌న్నీ ప్ల‌స్ పాయింట్లే. కానీ మైన‌స్ పాయింట్లూ ఉన్నాయి. ఇప్పుడు ప‌వ‌న్ చేతిలో బోలెడ‌న్ని సినిమాలు. అవ‌న్నీ పూర్త‌య్యే స‌రికి రెండు మూడేళ్లు ప‌డుతుంది. ఈలోగా కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి. అదే స్థానంలో పాత సినిమాలు చేజారిపోవ‌డం మొద‌లెట్టాయి. ప‌వ‌న్ చేతికి అందిన రీమేక్ `అప్ప‌య్య‌మ్ కోషియ‌మ్‌`.

 

సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ద‌గ్గ‌ర ఈసినిమా రైట్స్ ఉన్నాయి. ర‌వితేజ‌, రానాతో ఈ సినిమా రీమేక్ చేయాలనుకున్నారు. అయితే ప‌వ‌న్‌కి ఈ క‌థ న‌చ్చ‌డంతో ర‌వితేజ స్థానంలో ప‌వ‌న్ వ‌చ్చి చేరాడు. ప‌వ‌న్ తో సినిమా అనేస‌రికి నిర్మాత‌లు కూడా ఖుషీ అయ్యారు. అయితే.. ప్ర‌స్తుతం ప‌వ‌న్ ఈ సినిమా చేసే స్థితిలో లేడ‌ని టాక్‌. చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేయ‌కుండా కొత్త సినిమాలు ఒప్పుకోకూడ‌ద‌ని ప‌వ‌న్ నిర్ణ‌యించుకున్నాడ‌ట‌.

 

సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ‌కు సైతం ప‌వ‌న్ ఈ విష‌యం తేల్చి చెప్పేశాడ‌ని తెలుస్తోంది. ప‌వ‌న్ నో అన‌డంతో.. ఇప్పుడు ఈ సినిమా ర‌వితేజ‌, రానాల‌తోనే సెట్స్‌పైకి వెళ్తుంద‌ని టాలీవుడ్ టాక్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS